హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఉదయమే కారుమూరి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు – “కక్ష పెట్టుకొని అక్రమ అరెస్టు చేశారు. చంద్రబాబు-లోకేష్ చెప్పితేనే...
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ బిజినెస్‌లపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిగాయి. పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ నివాసాల్లోనూ దాడులు కొనసాగాయి. ఏటా వందల కోట్ల టర్నోవర్...
కార్తీక మాసం గురువారంతో ముగిసిపోనుండగా.. సాధారణంగా ఈ రోజుల్లో కూరగాయల ధరలు తగ్గాల్సి ఉండగా, ర్ను ధరలు మాత్రమే కాదు, గుడ్లు, చికెన్ కూడా ఆకాశాన్నంటాయి. మెంథా తుఫాన్ కారణంగా సరఫరా దెబ్బతినడంతో ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రూ.20-30కే దొరికే కూరగాయలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు....
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు భారీ నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిన్ భవనం వద్ద జరిగిన నిరసనలో కార్మిక నాయకులు...
సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమై మరణించిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతాత్మలకు...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ ప్రాంతాల్లో గంజాయి సేవ బహిరంగంగా జరుగుతోంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నప్పటికీ చర్యలు లేవని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ను ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు, బండ్ల సీటు కవర్లు...
తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని తక్షణమే సౌదీకి పంపించాలని ఆదేశించింది. మృతదేహాలను మత సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక...
హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నానని పేర్కొన్న ఆయన, ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామని, ఇదే హెచ్చరిక మీ అధినేతకు...