విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంగా, పవిత్ర ఆలయ పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి తిరగడం భక్తులలో ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారి దర్శనం అనంతరం, నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కుంకుమార్చన ప్రాంగణం, మరియు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి...