ప్రకృతి ఆగ్రహం ముందు మనిషి ఎంత బలహీనుడో మరోసారి స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘటన మరువకముందే, ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో ప్రకృతి విధ్వంసకరరూపం ప్రదర్శించింది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా మట్టికరిపించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ...