వీధికుక్కలకు రోడ్లపై ఆహారం పెట్టడంపై చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కలపై ప్రేమ ఉంటే వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టొచ్చు కదా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే సమయంలో స్థానికులు వేధిస్తున్నారని నోయిడాకు చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి....