ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాలనే ఉద్దేశంతో చేయలేదని, ఇబ్బంది పెట్టడం లేదా పరువు దెబ్బతీయడం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నానని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన వివాదంపై క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత, అధికారులను బయటకు పంపి, మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నర సేపు రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో...
తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించినట్లు తెలిసింది.కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గట్టి...
వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, ఆయన పెత్తనం మితిమీరిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ ఫిర్యాదును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి నేరుగా ఫోన్...