గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ భవనం కూల్చివేతపై దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “చట్టబద్ధంగా నోటీసు ఇవ్వకుండా ఉదయాన్నే ఎందుకు కూల్చారు? హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇస్తే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా నియంత్రించలేని పరిస్థితి వస్తుంది” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికార...
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2023లో నమోదైన టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసును తెలంగాణ హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ “చేయని తప్పుకు అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. కార్యకర్తల ఒత్తిడికి తట్టుకోలేక కక్ష సాధింపుగానే కేసు పెట్టారు. ఈ తీర్పు ఆ కక్షలకు అద్దంపట్టింది....
మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు “ఈ ఇద్దరూ మా అదుపులో లేరు. అరెస్టు చేసిన వారిని నియమాల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం” అని నివేదిక సమర్పించారు. కానీ పిటిషనర్ తరఫు న్యాయవాది “పోలీసులు ముందు...
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దొనడి రమేష్,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఈ తీర్పు వెలువడింది. 2016లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిపై గోపన్నపల్లిలోని 31...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపారు. త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. మద్రాస్, రాజస్థాన్ హైకోర్టుల...
సోషల్ మీడియాలో వేధింపులకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా హైకోర్టు జడ్జికి సైతం వేధింపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోషల్...
కోర్టు ధిక్కరణ పిటిషన్ మేరకు తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు హైకోర్టు పిటిషన్ నోటీసులు జారీ చేసింది. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీల్లో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని...
మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాల పరిమితి ఈ ఏడాది మార్చి 25వ తేదీన ముగిసినా, ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శనివారం విచారించింది. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ తరపు...