తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన నేపథ్యంలో, ఆమోదం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. జంతర్ మంతర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1...