మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తీర జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావం...
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను మోంథా తుఫాన్ హడలెత్తించింది. నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య తీవ్ర తుపాను దాటింది. దీంతో సముద్రం అల్లకల్లోలమైంది. ప్రస్తుతం రెండు మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను కాస్త బలహీనపడి మచిలీపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో...
మోంథా తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రయాణికుల భద్రత కోసం వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 43 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే 75కు పైగా రైళ్లు రద్దు చేశారు. అక్టోబర్ 27 28 29 30 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితా...
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు, జోనల్ ఇంఛార్జులను కూడా నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా పలు జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సేవల ఒప్పందాన్ని టీడీపీ నాయకుడితో సంబంధం ఉన్న సంస్థకు కట్టబెట్టడం ద్వారా నెలకు రూ.31 కోట్ల ఆదాయం పార్టీకి సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం నాటికి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అని నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి...
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో నిద్రలో ఉన్నవారు సజీవ దహనానికి గురయ్యారు. తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మృతదేహాలు పోస్టుమార్టం గదిలో ఉన్నాయి. వైద్యులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటివరకు 19...
కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి...
కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇరువురు నాయకులు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎక్స్ వేదికగా స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ఈ ఘటన విషాదకరమని, గాయపడినవారు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...