ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో మహాసమాధిని దర్శించుకున్న అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రూ.100 స్మారక నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు నెట్‌వర్క్‌పై పోలీసులు భారీ దాడులు చేస్తూ పెను ప్రభావం చూపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టు నేత మడకం హిడ్మా, ఆయన భార్య హేమా పండిత్ సహా ఆరుగురు మరణించారు. బుధవారం మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ...
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ (మావోయిస్టు) పోలిట్‌బ్యురో సభ్యుడు, బస్తర్ డివిజన్ కమాండర్ హిడ్మా కూడా ఉన్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ధృవీకరించారు. ఇంటెలిజెన్స్...
హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఉదయమే కారుమూరి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు – “కక్ష పెట్టుకొని అక్రమ అరెస్టు చేశారు. చంద్రబాబు-లోకేష్ చెప్పితేనే...
కార్తీక మాసం గురువారంతో ముగిసిపోనుండగా.. సాధారణంగా ఈ రోజుల్లో కూరగాయల ధరలు తగ్గాల్సి ఉండగా, ర్ను ధరలు మాత్రమే కాదు, గుడ్లు, చికెన్ కూడా ఆకాశాన్నంటాయి. మెంథా తుఫాన్ కారణంగా సరఫరా దెబ్బతినడంతో ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రూ.20-30కే దొరికే కూరగాయలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు....
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు భారీ నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిన్ భవనం వద్ద జరిగిన నిరసనలో కార్మిక నాయకులు...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ ప్రాంతాల్లో గంజాయి సేవ బహిరంగంగా జరుగుతోంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నప్పటికీ చర్యలు లేవని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ను ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు, బండ్ల సీటు కవర్లు...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక...
హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నానని పేర్కొన్న ఆయన, ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామని, ఇదే హెచ్చరిక మీ అధినేతకు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...