ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కలిసి పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.
ఏపీలో రాజకీయం లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, భేరసారాలతో మద్యం షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికార పార్టీ నేతలే ఎక్కువ దరఖాస్తులు వేశారు. మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే మూడు వరించాయి. అనంతపురం జిల్లా...