ఫుట్ బాల్ ఆట గురించి మీకు తెలుసా..? .. ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు ఉన్న ఆట ఫుట్ బాల్. ఈ ఆటను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు చూడటం విశేషం. ఫుట్ బాల్ ఆటను చైనాలో క్రి.పూ. రెండవ శతాబ్దంలో కుజు అనే పేరుతో ఆడినట్టు ఆధారులు లభించాయి. హర్పస్తుమ్ అనే ఐరోపాలోని రోమునగర వాసులు ఆడిన ఆట ద్వారా ఫుట్ బాల్ అవతరించిందని పలువురు చెబుతున్నారు. ఫుట్ బాల్ సంఘం 1863వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన ఏర్పటుచేయబడింది. ఇందులో చేతితో తాకడాన్ని నిశేదించడంతో పలు జట్టులు బయటకు వెళ్లి రగ్బీ జట్లు ఏర్పడ్డాయి. 1886వ సంవత్సరంలో అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం బోర్డు ఏర్పటు చేశారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మద్య 1872వ సంవత్సరం గ్లాస్గోలో మొదటి అంతర్జాతీయ ఆట జరిగింది. ఇంగ్లాండ్ లోని ఫుట్ బాల్ లీగు మొదటి ప్రపంచ ఫుట్ బాల్ లీగు. 1930వ సంవత్సరంలో ఫిపా అంతర్జాతీయ అసోసియేషన్ ఫుట్ బాల్ సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిఫానే నిర్వహిస్తోంది.
ఫుట్ బాల్ ఆట అంటే..?
ఫుట్ బాల్ ఆట లేదా కాలుతో ఆడే బంతి ఆట అని కూడా అనవచ్చు. ఒక్కో జట్టులో 11మంది సభ్యులు ఉంటారు. దీర్ఘచతురస్త్రాకార మైదానంలో రెండు వైపులా చివరలా మద్యలో గోల్ పోస్టులు ఉంటాయి. బంతిని గోల్ పోస్టుకు చేర్చడం ద్వారా పాయింట్ల రూపంలో విజేతలను నిర్ణయిస్తారు. ఒక గోల్ కీపర్ మినహా ఏ ఆటగాడు బంతిని చేతితో తాకరాదు. బంతి మైదానం బయటకు వెలితే మాత్రమే చేతిని ఉపయోగించి లోపలికి విసరాలి. అవకాశం ఉన్నప్పుడల్లా తమ కంటే ముందున్న తమ జట్టు ఆటగాడికి బంతిని అందిస్తూ గోల్ చేయడానికి చూస్తారు. ఫుట్ బాల్ ఆటలో రెండు బాగాలుగా 45 నిమిషాలు ఆడతారు. మద్యలో 15 నిమిషాల విరామం కూడా ఉంటుంది. ఫిఫా కార్యనిర్వాహక సమితి అతిథ్యమిచ్చే దేశాన్ని ఎన్నికల ద్వారా ఎంపిక చేస్తుంది.
2022 ఫీఫా వరల్డ్ కప్
ఫీఫా వరల్డ్ కప్ 2022 ఆసియా ఖండంలోని ఖతార్ దేశంలో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ కోసం 32 దేశాలు పోటీ పడుతున్నాయి. రౌండ్ లో 16 జట్లు, క్వార్టర్ ఫైనల్ లో 8 జట్లు, సెమీఫైనల్ లో 4 జట్లు పోటీ పడి ఫైనల్ కు రెండు జట్లు చేరతాయి. మూడవ స్థానం కోసం సెమీ ఫైనల్ లో ఓడిన రెండు జట్లు పోటీ పడతాయి.