శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈనెల 6 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ దిముత్‌కి 100వది. శ్రీలంక తరఫున కరుణరత్నే 99 టెస్టులు ఆడి 7,172 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 50 వన్డేల్లో 1,316 పరుగులు చేయగా.. ఒక శతకం, 11 అర్ధశతకాలు ఉన్నాయి.