Thursday, November 21, 2024

క‌ల్వ‌కుంట్ల క‌విత జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా!

Must Read

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్టుపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ విష‌యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ తప్పదంటూ తిరుమ‌ల‌లో రాజ‌గోపాల్‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా సంబంధాలు ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో క‌విత అరెస్టుపై చ‌ర్చ జ‌రుగుతోంది.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ అంటూ గ‌తంలో ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి అతడ్ని ఈ నెల 1వ తేదీ రాత్రి ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. గురువారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. అమన్ దీప్ సింగ్‌కు సౌత్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐర్‌ ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలులో అమన్‌దీప్‌తో పాటు ఆప్ ఫంక్షనరీ విజయ్ నాయర్, మనోజ్ రాయ్ కీలక పాత్ర పోషించారు.

టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని బీజేపీ ఎంపీ తెలిపారు. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటున్నారు. మొదటి ఇన్ స్టాల్ మెంట్ కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ రూ. 150 కోట్లు ఇచ్చారన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని చెప్పారు. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ హోటల్ లోనే ఉండి తతంగం నడిపించారని బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ ర్వేజ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. తాజాగా రాజ‌గోపాల్‌రెడ్డి క‌విత‌పై కామెంట్ చేయ‌డం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -