వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు సవాలు విసిరారు. కరువుకు కేర్ అఫ్ అడ్రెస్స్ చంద్రబాబు నాయుడికి, వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న తనకు మధ్య యుద్ధం జరుగుతుందని, మీకు మంచి జరిగితేనే నాకు మద్దతుగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలను కోరారు.
► రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.
► రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ నేడు జమచేశారు.
►రైతు బాగుండాలని మనమంతా చేసే ప్రార్థనలు, పూజలు దేవుడు చూశాడు.. దేవుడు విన్నాడు.. దేవుడు దీవించాడు .
మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో రైతుల కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 1.45 లక్షల కోట్లు.
► అరకోటికి పైగా(51 లక్షలు) రైతు కుటుంబాలకు ఈ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా మంచి జరుగుతోంది.
వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 1,090 కోట్లు నిధులు విడుదల..
►మూడు సంవత్సరాల 9 నెలల కాలంలో పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ పరిహారం చెల్లింపు జరిగాయి.
ఇప్పటి వరకు కేవలం రైతు భరోసా ద్వారానే ఒక్కొక్క కుటుంబానికి అందించిన సాయం రూ. 54 వేలు సాయం చేశాం.
మొత్తం ఐదేళ్లలో అందించనున్న సాయం రూ. 67,500.
►వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా నాలుగేళ్లు కూడా గడవక ముందే ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ. 27,062 కోట్లు. ఇది రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే.. ఇదీ రైతన్నల మీద మమకారం,
ఇదీ వ్యవసాయం మీద ప్రేమంటే ఇట్టా ఉంటుంది…
►పంట నష్ట పరిహారంకి సంబంధించి ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపు పరిహారం ఇస్తున్న ప్రభుత్వం మనది. 2022 డిసెంబర్‌లో మండూస్ తుపాన్ కారణంగా నష్టపోయిన 91,237 మంది రైతున్నలకు రబీ 2022 ముగియకుముందే రూ. 77 కోట్ల పరిహారాన్ని నేరుగా వారి అకౌంట్లోకి జమ చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో కేవలం ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో 22లక్షల 22 వేల మంది రైతన్నలకు రూ. 1,911 కోట్లు ఇచ్చినట్టు అవుతుంది.
► వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. గతంలో మాదిరిగా రెయిన్ గన్‌లు లేవు.. రెయిన్ మాత్రమే ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు ఊసే లేదు. 2014-19 మధ్య ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్ కాలంలో ఏటా కరువే.. కనీసం 300 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించే దయనీయ దుస్థితి..
► మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేదు… కరువుగా కేరాఫ్ అడ్రస్ 1995-2004 వరకు అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. 2014నుంచి 2019 ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి
►ఈయన వచ్చినప్పుడల్లా కరువు ఖచ్చితంగా వస్తుంది… గతాన్ని పరిశీలిస్తే కనిపించే నగ్న సత్యమిది..గత వైఎస్సార్ పాలనలో కానీ, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి కానీ ఏనాడూ కరువు లేదు. సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఇదంతా మంచి పరిపాలన చూసి దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా ఉంది..
► చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పం, కరువు జిల్లా అనంతపురం.. రాష్ట్రంలో ఏ మూలన చూసినా మంచి వర్షపాతం నమొదైంది. ఆహార ధాన్యాల దిగుబడి నాడు 154 లక్షల టన్నులు కాగా నేడు 166 లక్షల టన్నులు
ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగింది.
► గతంలో సేకరించిన 2.65 కోట్ల టన్నులు కాగా నేడు మూడేళ్ల 8 నెలల కాలంలోనే 2.94 కోట్ల టన్నులు . ధాన్యం సేకరణకు చంద్రబాబు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ. 40,237 కోట్లు, నేడు 3.8 నెలలకాలంలో రూ. 55,444 కోట్లు
►ఉద్యాన పంటల విస్తీర్ణం అదనంగా 1,43,901 హెక్టర్లు పెరిగింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో దిగుబడి చూస్తే ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉండగా ..మీ బిడ్డ ప్రభుత్వంలో 332 లక్షల టన్నులకు పెరిగింది. ఏకంగా 104 లక్షల టన్నులు ఎక్కువగా నమోదవుతోంది. ఇవన్నీ అభివృద్ధికి సూచికలు.. ఇంటింటా జరుగుతున్న అభివృద్ధి..
► రైతు భరోసా ద్వారా రూ. 27 వేల కోట్లు
పట్టా ఉన్న రైతులతోపాటు అసైన్డ్, కౌలు, ఆర్వోఎఫ్ఆర్, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా సాయం అందించిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వమని సవినయంగా చెబుతున్నా…
►గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వేగంగా ముందుకు వేస్తున్నాం..దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాల నుంచి అధికారులు, నిపుణులు వచ్చి చూసిపోతున్నారు.
► పంట బీమా కూడా ఒక్క రూపాయి కూడా రైతు భరించాల్సిన పరిస్థితి లేకుండా రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే..
► గత చంద్రబాబు ప్రభుత్వంలో పంటల బీమా కింద ఐదేళ్లలో ఇచ్చిన మొత్తం కేవలం రూ. 3,411 కోట్లు మాత్రమే.
నేడు మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో వైఎస్సార్ పంటల బీమా ద్వారా 44 లక్షల 48వేల మంది రైతన్నలకు ఇచ్చింది రూ. 6,685 కోట్లు
►కరువు పరిస్థితులున్నప్పటికీ ఇచ్చింది కేవలం రూ. 3,411 కోట్లు.. మన ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే దాదాపు రెండింతలు సాయం చేసింది…రైతన్నలకు ఏ కష్టం వచ్చినా సీజన్ ముగియక మునుపే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుంది…
► ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ద్వారా ఇప్పటివరకు రూ. 2,647 కోట్లు అందించడం జరిగింది.
ఉచిత విద్యుత్ ద్వారా మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు రూ. 27,800 కోట్లు
పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించేలా ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ. 1,700 కోట్లు ఖర్చు చేశాం..
గత బాబు హయాంలో విద్యుత్ బకాయిలు రూ. 8,845 కోట్లు పెట్టి దిగిపోతే మీ బిడ్డ రైతన్నల కోసం చిరునవ్వుతో తీర్చాడు..
► సున్నా వడ్డీ కింద 77 లక్షల 88 వేల మంది రైతన్నలకు కింద గత బకాయిలతో కలిపి రూ. 1,834 కోట్లు
విత్తన బకాయిలు రూ. 384 కోట్లు,ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు.. మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించింది..
► కేవలం వ్యవసాయం కోసం మీ బిడ్డ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల 8 నెలల కాలంలో చేసిన ఖర్చు అక్షరాలా రూ. 1.45 లక్షల కోట్లు.
►మనది రైతు ప్రభుత్వం- చంద్రబాబుది పెత్తందారుల పార్టీ
వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్‌షిప్ ఉన్న చంద్రబాబుకి, వరుణ దేవుడు ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి
►ఇంగ్లిష్ మీడియం వద్దన్న బాబుకి- ప్రభుత్వం సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియం, నాడు-నేడు తో బడుల రూపురేఖలు మార్చిన మన ప్రభుత్వానికీ
►అన్నదాతలకు నేటితో సీఎం జగన్ చేసిన సాయం
-1.46 లక్షల కోట్లు
[జగనన్న ప్రభుత్వం..
మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు అందించిన సాయం- 1,45,751 కోట్లు (Feb 28,2023)
1.వైఎస్సార్ రైతు భరోసా PM KISAN
రైతుల సంఖ్య-52.38 లక్షలు
ఆర్థిక సాయం-27,062 కోట్లు
(ఇప్పటివరకు ఒక్కో రైతుకు కేవలం రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా అందించిన సాయం 54 వేలు )
- వైఎస్సార్ ఉచిత పంటల బీమా
రైతుల సంఖ్య-44.28 లక్షలు
ఆర్థిక సాయం-6,685 కోట్లు - ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం
రైతుల సంఖ్య-22.22 లక్షలు
ఆర్థిక సాయం-1,912 కోట్లు - ధాన్యం కొనుగోలు
ఆర్థిక సాయం-55,402 కోట్లు - ఇతర పంటల కొనుగోలు
ఆర్థిక సాయం-7,156 కోట్లు - ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ
ఆర్థిక సాయం-27,800 కోట్లు - ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ
ఆర్థిక సాయం-2,647 కోట్లు - పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుకు
ఆర్థిక సాయం-1,700 కోట్లు - శనగ రైతులకు బోనస్
ఆర్థిక సాయం-300 కోట్లు - సూక్ష్మసేద్యం, పండ్ల తోటల అభివృద్ధి
రైతుల సంఖ్య-13.58 లక్షలు
ఆర్థిక సాయం-1,264 కోట్లు - ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ
రైతుల సంఖ్య-32,000
ఆర్థిక సాయం-85 కోట్లు - వైఎస్సార్ యంత్ర సేవా పథకం
ఆర్థిక సాయం-691 కోట్లు - విత్తన సబ్సిడీ
రైతుల సంఖ్య-60.76 లక్షలు
ఆర్థిక సాయం-1,024 కోట్లు - వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు
(జగన్ ప్రభుత్వం చెల్లించిన టీడీపీ ప్రభుత్వ బకాయిలతో సహా)
రైతుల సంఖ్య-73.88 లక్షలు
ఆర్థిక సాయం-1,835 కోట్లు - జగన్ ప్రభుత్వం చెల్లించిన టీడీపీ ప్రభుత్వ ధాన్యం సేకరణ బకాయిలు
ఆర్థిక సాయం-960 కోట్లు - టీడీపీ ప్రభుత్వం పెట్టిన కరెంటు బకాయిలు
(జగన్ ప్రభుత్వం మీద వేసుకున్నవి)
ఆర్థిక సాయం-8,845 కోట్లు - టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు
(జగన్ ప్రభుత్వం చెల్లించింది)
ఆర్థిక సాయం-384 కోట్లు
మొత్తం సాయం-రూ.1,45,751 కోట్లు