Thursday, September 19, 2024

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

Must Read

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

సినిమా: రంగమార్తాండ
యాక్టర్స్: ప‌్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్.
డైలాగ్స్: ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి
మ్యూజిక్: ఇళయరాజా
నిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీ
నిర్మాణ సంస్థ‌: హౌస్‌ఫుల్ మూవీస్‌, రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
రిలీజ్ డేట్: 22-03-2023

తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడ‌తా’ మొద‌లుకొని ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఆడియెన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారాయన. సింధూరం, అంతఃపురం, ఖ‌డ్గం లాంటి చిత్రాలతో క్లాసిక్ మూవీస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మ‌ధ్య‌లో కొన్నాళ్లు ఫామ్ కోల్పోయినా.. ఆయ‌న‌పై ప్రేక్షకుల్లో అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌లేదు. కొంచెం గ్యాప్ త‌ర్వాత ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా ‘రంగ‌మార్తాండ‌’ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది.

Must Read: Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

మ‌రాఠీ మూవీ ‘న‌ట‌సామ్రాట్‌’కి రీమేక్‌గా రూపొందింది ‘రంగమార్తాండ’. కృష్ణ‌వంశీ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్ర‌లు పోషించి పుర‌స్కారాలు అందుకున్న ప్ర‌కాశ్‌రాజ్.. ఇందులో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఫిల్మ్లో బ్ర‌హ్మానందం త‌న యాక్టింగ్లోని సరికొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ చేశారు. మ‌రి ఈ మూవీ ఎలా ఉంది? కృష్ణ‌వంశీ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లేనా? అనేది తెలుసుకుందాం..

క‌థ:

రంగ‌స్థ‌లంపై ఎన్నో పాత్ర‌ల‌కు జీవం పోసి ర‌క్తి క‌ట్టించిన యాక్టర్ రాఘ‌వ‌రావు (ప్ర‌కాశ్‌ రాజ్‌). నాట‌క‌రంగ‌మే తన ప్ర‌పంచంగా బ‌తికిన రాఘవరావుకు రంగ‌మార్తాండ అనే బిరుదునూ ప్రదానం చేస్తారు. ఆయ‌న మిత్రుడు చ‌క్ర‌పాణి (బ్ర‌హ్మానందం) కూడా రంగ‌స్థ‌ల న‌టుడే. వీళ్లిద్ద‌రూ క‌లసి దేశ విదేశాల్లో ఎన్నో ప్ర‌దర్శ‌న‌ల‌తో ఆడియెన్స్ నుంచి అప్లాజ్ అందుకున్నవారే.

రంగ‌మార్తాండ బిరుదుతో త‌న‌ను స‌త్క‌రించిన వేదిక‌ పైనే నాట‌క రంగం నుంచి నిష్క్ర‌మిస్తాడు ప్రకాశ్ రాజ్. అన్ని రోజులు తాను సంపాదించిందంతా వార‌సుల‌కు క‌ట్ట‌బెడ‌తాడు రాఘ‌వరావు. అక్క‌డి నుంచి ఆయ‌న లైఫ్లో కొత్త ఛాప్టర్ మొద‌ల‌వుతుంది. అనంతరం ఆయనకు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థ‌లంపై పోషించిన ప్ర‌తిపాత్ర‌నీ ర‌క్తి క‌ట్టించిన రాఘ‌వ‌రావుకు.. రియల్ లైఫ్ ఎలాంటి క్యారెక్టర్ను ఇచ్చింది? మ‌రి.. జీవిత నాట‌కంలో ఆయన గెలిచాడా లేదా ఓడాడా? లాంటి విష‌యాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

నాట‌క‌రంగం నేప‌థ్యంలో సాగే అమ్మానాన్న‌ల క‌థే ‘రంగమార్తాండ’ మూవీ. రిటైర్మెంట్ లైఫ్ గ‌డుపుతున్న క‌న్న‌వాళ్ల‌ను ఎలా చూసుకోవాలో, వాళ్ల‌తో ఎలా మెల‌గాలో చెప్పే పిల్ల‌ల స్టోరీ ఇది. మొత్తంగా చెప్పాలంటే.. ప్రస్తుత జీవితాలను ప్ర‌తిబింబిస్తూ మ‌న‌సుల్ని త‌డిచేసే ఓ హృద్య‌మైన కథ ఇది.

కృష్ణ‌వంశీ త‌న మార్క్ తెలుగుద‌నం, పాత్రల చిత్రణ, భావోద్వేగాలతో ఈ సినిమాను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. న‌టులు ఒక్కొక్క‌రూ ఒక్కో రంగ‌మార్తాండుడిలా స్క్రీన్పై విజృంభించారు. త‌మ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. రాఘ‌వ‌రావు, చ‌క్ర‌పాణి పాత్రలైతే థియేట‌ర్ నుంచి బ‌య‌టికొచ్చాక కూడా ప్రేక్షకుల్ని వెంటాడతాయి. అంత ప్ర‌భావం చూపిస్తుందీ మూవీ ఇందులోని పాత్రలు.

Must Read: రానా నాయుడు వెబ్​ సిరీస్​ ఎలా ఉందంటే..!

భ‌ర్త చాటు భార్య‌గా బ‌తుకుతున్న రాజుగారు (ర‌మ్య‌కృష్ణ‌) త‌న భ‌ర్త‌కు అవ‌మానం ఎదురైన‌ప్పుడు ఆమె ప‌డే వేదన‌ ‘రంగమార్తాండ’కు మెయిన్ హైలైట్గా నిలిచింది. ఇక, ఆస్ప‌త్రిలో ప్ర‌కాశ్‌రాజ్-బ్ర‌హ్మానందం మ‌ధ్య జరిగే సీన్స్ అయితే సినిమాకే ఆయువుప‌ట్టుగా నిలిచాయి. కమర్షియల్ మూవీస్కు అడ్డాగా చెప్పుకునే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో.. మ‌న‌సుల్ని త‌డిచేసి, హృద‌యాల్ని మెలిపెట్టే ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి మ‌రో సినిమానే ‘రంగమార్తాండ’. ఇందులోని మెసేజ్ నేటిత‌రానికి చాలా అవ‌స‌రం.

ఎవ‌రెలా చేశారంటే:

ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అనుభవాన్ని రంగరించి ఈ ముగ్గురూ సినిమాకి మూల‌స్తంభాలుగా నిలిచారు. ప్ర‌కాశ్‌రాజ్ చాన్నాళ్ల త‌ర్వాత ఒక బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆయన తన పాత్రను బాగా ర‌క్తిక‌ట్టించారు. ప‌ద్యాలు, ఇంగ్లీష్ డైలాగులు, అచ్చ తెలుగు మాట‌ల్ని ఎంతో చక్కగా చెబుతూ ఆ క్యారెక్టర్కు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చారాయన. ప్ర‌కాశ్‌రాజ్ త‌ప్ప ఇంకొకరు ఆ పాత్ర చేయలేరేమో అనేలా నటించారాయన.

బ్రహ్మీ ఎప్పటికీ గుర్తుండేలా

బ్ర‌హ్మానందంలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు ఈ మూవీలో చూస్తారు. ఆయ‌న పేరు చెప్ప‌గానే కామెడీ క్యారెక్టర్లే అందరికీ గుర్తొస్తాయి. కానీ ఆయ‌న ‘రంగమార్తాండ’లో హృద‌యాల్ని బ‌రువెక్కించేలా న‌టించి ఆడియెన్స్ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. ర‌మ్య‌కృష్ణ ఎక్కువ డైలాగ్స్ లేకుండా… క‌ళ్ల‌తోనే భావోద్వేగాలు ప‌లికించే క్యారెక్టర్ను బాగా చేసింది. రాజుగారూ అంటూ ఆమెను ప్ర‌కాశ్‌రాజ్ పిలవడం.. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ, అన్యోన్య‌తను చూస్తే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి వాళ్ల పేరెంట్స్ గుర్తుకురాక మాన‌రు. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్, అలీ రెజా నేటిత‌రం క్యారెక్టర్లలో ఒదిగిపోయారు.

మాటలు హైలైట్

టెక్నికల్గానూ ఈ సినిమా ఉన్న‌తంగా ఉంది. ఇళ‌య‌రాజా మ్యూజిక్ సినిమాకి ప్ర‌ధాన బ‌లమని చెప్పాలి. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టోరీలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్ మాట‌లు సినిమాకు మ‌రో హైలైట్గా చెప్పుకోవచ్చు. నాట‌కం, జీవితం, చిత్రాలపై ఎంతో అవ‌గాహ‌న ఉంటే త‌ప్ప ఇలాంటి మాట‌లు రాయ‌డం సాధ్యం కాదు. మూవీ ప్రారంభంలోనే ల‌క్ష్మీభూపాల్ రాసిన ‘నేను నటుడ్ని’ అనే షాయిరీని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటుంది. చివ‌రగా చెప్పొచ్చేది ఏంటంటే.. మన మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది ‘రంగమార్తాండ’.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -