ఐకమత్యమే మహా బలం అనే మాటకు నిదర్శనంగా మారింది ఏపీ బీజేపీ. న్యూ ఇయర్ సందర్భంగా సినీ నటి, బీజేపీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మాధవీలతకు మద్దతుగా బీజేపీ నేతలంగా ఏకమయ్యారు. కూటమి సర్కారు అధికారంలో భాగమైన సంగతి తెలిసిందే. బీజేపీ కార్యకర్తలను పార్టీ నేతలంతా మద్దతుగా నిలబడడం శుభపరిణామమని చెబుతున్నారు.