- వైఎస్ జగన్ ఎమోషనల్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అని, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. గడప దాటితే హిందూ, ఇస్లాం, సిక్కు, బౌద్ధ మతాలను గౌరవిస్తానని తెలిపారు. పాదయాత్ర ఆరంభంలో వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నానని, పాదయాత్ర ముగింపు రోజు కూడా తిరుమలకు కాలినడకన వెళ్లానని గుర్తు చేశారు. లౌకిక దేశంలో కుల, మతాల గురించి అడిగి అగౌరవపరడం బాధ కలిగిస్తోందన్నారు. తన మతం ఎప్పుడూ మానవత్వమేనని తెలిపారు. ఒక మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. దళితులు, పేదల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం లౌకిక, గణతంత్ర దేశమని గుర్తు చేశారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం ఏంటని ప్రశ్నించారు.