తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. పాత, కొత్త బేధాలు లేకుండా అధిష్టానం మధ్యేమార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫిబ్రవరి 15 కల్లా నూతన అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉండటంతో.. తెరపైకి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రారావు, మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్, డీకే అరుణలో ఒకరికి పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చే అవకాశం ఉంది.