ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. మరోవైపు నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా బిహార్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.