ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ వెంట న్యాయమూర్తి రామచంద్రరావు ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణ సమయంలో తన వెంట లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం లాయర్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
మరోవైపు కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు అర్వింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.