Home News ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు

0
129

హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు(మంగళవారం) ఉదయం ఆయనకు బెయిల్‌ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌ రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు.