Saturday, August 30, 2025

కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు

Must Read

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు స్థానాల కోసం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ కొనసాగనుంది. పులివెందుల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

ఉద్రిక్తతల వాతావరణం
పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పులివెందులలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఆయనను కడపకు తరలించారు. వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, ఆయన హౌస్‌ అరెస్ట్‌పై అభ్యంతరం లేదని, ఎన్నికల గ్రామాలకు వెళ్లనని తెలిపారు. ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సర్పంచ్‌ లక్ష్మీనారాయణను కూడా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందుల ఉప ఎన్నికల కోసం 550 మంది పోలీసులు, 4 ప్లటూన్లు, ఏఆర్‌ పోలీసు బలగాలు నియమించారు. ఒంటిమిట్టలో 650 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు మండలాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, స్థానికేతరులపై నిఘా పెట్టారు. పులివెందులలో ఇప్పటివరకు 750 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు పోలీసుల కఠిన భద్రతా వలయంలో, ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -