హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఉదయమే కారుమూరి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు – “కక్ష పెట్టుకొని అక్రమ అరెస్టు చేశారు. చంద్రబాబు-లోకేష్ చెప్పితేనే అరెస్టులా? రాజకీయ నాయకులు మాట్లాడకూడదా?” అని నిలదీశారు. టీటీడీ పరకామణి కేసులో మరణించిన సీఐ సతీష్ కుమార్ ఘటనను కూడా అనుమానస్పదమని, అది హత్యేనా? అని ప్రశ్నించారు అంబటి.

