Friday, August 29, 2025

ఏపీలో ఉన్న‌ది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? – వైయ‌స్ జ‌గ‌న్‌

Must Read

ఏపీలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య‌మా లేక రాక్ష‌స పాల‌నా అని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సీఎం చంద్రబాబుపై ధ్వజం

సీఎం చంద్ర‌బాబుపై వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప్రతీ ఆలోచన, ప్రతీ చర్య కుట్రతోనే నిండి ఉంద‌న్నారు. రైతులకు మద్దతుగా నిలిచామని త‌మ‌ మీదే కేసులు పెడుతున్నార‌న్నారు. త‌న‌ సెక్యూరిటీ తగ్గించార‌ని, పర్యటనల్లో ఉద్రిక్తతలు సృష్టించి తరువాత తప్పుడు కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు మాకు సహకరించడం లేద‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

హారికపై దాడిని ఖండించిన జగన్

గుడివాడ ఘటనను ప్రస్తావిస్తూ, బీసీ మహిళ, జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి జరిగినా పోలీసులు మౌనంగా నిలిచారని ఆరోపించారు. “పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బీసీ మహిళలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారంటే, పోలీసుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు.

“ప్రజాస్వామ్యానికి సంకేతమైన హక్కులను తుంచుతున్నారు”
“ఒక రాజకీయ పార్టీగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా హక్కు. కానీ ఇవన్నీ చంద్రబాబుకు నచ్చట్లేదు. ఆయన మాట వినని అధికారులను వీఆర్గా పంపిస్తున్నారు, కొంతమందిని సస్పెండ్ చేస్తూ భయపెడుతున్నారు. పోలీసులు భద్రతకోసం ఉండరా? ఇప్పుడు మా సభలకు ఎవరూ రాకూడదని ప్రయత్నిస్తున్నారు” అని జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హామీలపై ప్రశ్నలు
“ఓ సంవత్సరం గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదు చంద్రబాబు. విద్యుత్ చార్జీల రూపంలో రూ.15,000 కోట్లు భారం మోపారు. విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచారు. ప్రజలు మోసపోయారనే కారణంగా ‘వెన్నుపోటు దినం’, ‘రికాలింగ్ చంద్రబాబూ మేనిఫెస్టో’ వంటి కార్యక్రమాలు చేపట్టామనేది నిజం” అని తెలిపారు. “చంద్రబాబు ప్రభుత్వం ఇక మూడేళ్లే టిక్కెట్. ప్రజలు ఆయనను నమ్మడం లేదు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రానుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పోరాడుతున్నాం” అని అన్నారు జగన్.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -