సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమై మరణించిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతాత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

