ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని అన్నారు. నల్లపాడు స్టేషన్ పరిధిలో హత్య కేసులో వైసీపీ కార్యకర్తను అరెస్టు చేశారని అన్నారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ తరపు వీరయ్యను అరెస్టు చేశారని అన్నారు. మధ్యవర్తినామాలో పోలీసులు ఇష్టానుసారం రాసుకుని సంతకం చేయించుకున్నారని అన్నారు. పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని అన్నారు. నకిలీ మద్యం కేసు గురించి కాశీబుగ్గలో ధర్నా చేశారని అన్నారు. వైసీపీ వారిపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తే పోలీసుల మీద హత్యాయత్నం కేసు పెట్టారని అన్నారు. కోర్టు బెయిల్ ఇస్తుందని మర్డర్ కేసులు పెడుతున్నారని అన్నారు. కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తున్నారని అన్నారు. బుద్ధి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మనోహర్ రెడ్డి హెచ్చరించారు.