Wednesday, November 19, 2025

మెడికల్ కాలేజీల‌ ప్రైవేటీకరణపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

Must Read

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ముమ్మరం చేసింది. బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతల నేతృత్వంలో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 17 నెలల్లో 2.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలను మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టలేకపోతోందని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి ర్యాలీలు నిర్వహించనున్నారు. నూతన మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతులు లేవని చెబుతూ నేతలకు నోటీసులు జారీ చేశారు. 2019కి ముందు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 17 కొత్త కళాశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. వీటిలో ఐదు కళాశాలలు ప్రారంభమై 750 అదనపు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. పాడేరు, పులివెందుల కళాశాలలు పూర్తయ్యాయి. మిగతా 10 నిర్మాణ దశలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని సిద్ధమవుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్‌సీపీ ఉద్యమం చేపట్టింది. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది. ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త కళాశాలలు ప్రభుత్వ రంగంలో పూర్తవుతాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -