కార్తీక మాసం గురువారంతో ముగిసిపోనుండగా.. సాధారణంగా ఈ రోజుల్లో కూరగాయల ధరలు తగ్గాల్సి ఉండగా, ర్ను ధరలు మాత్రమే కాదు, గుడ్లు, చికెన్ కూడా ఆకాశాన్నంటాయి. మెంథా తుఫాన్ కారణంగా సరఫరా దెబ్బతినడంతో ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రూ.20-30కే దొరికే కూరగాయలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్ల డజను రూ.98కు చేరింది. చికెన్ కిలో రూ.240-260 నుంచి కార్తీకంలో రూ.200-220కి తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పైకి లాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దళారులు ఏకమై ధరలు పెంచేశారని, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం.

