ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఈ నిర్ణయం, కరోనా మహమ్మారి సమయంలో WHO ప్రవర్తనపై అసంతృప్తి, చైనా ప్రభావం ఎక్కువగా ఉందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో తీసుకోబడింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రేయేసస్ “అమెరికా వైదొలగడం కేవలం సంస్థకే కాదు, ప్రపంచ ప్రజల ఆరోగ్య భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది.. ఇది ప్రతికూల సంకేతం” అని అన్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

