Sunday, January 18, 2026

ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా గెలిచింది – ఉద్ధవ్ ఠాక్రే

Must Read

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాభిమానంతో వచ్చిన విజయం కాదని, పూర్తిగా కుట్రపూరితంగా, అక్రమంగా సాధించిన గెలుపని అన్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయిని పూర్తిగా తాకట్టు పెట్టాలన్న లక్ష్యంతోనే బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. ఈ ఒక్క ఎన్నికల ఫలితాలతో తమను రాజకీయంగా నిర్వీర్యం చేశామని బీజేపీ నేతలు భావిస్తే అది వారి భ్రమేనన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ముగియలేదని, అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న కుట్రలను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ శివసేన 64 స్థానాలు గెలుచుకుందని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ముంబయిలో శివసేన నుంచే మేయర్ రావాలన్నది తన కల అని, అదే జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. బీఎంసీలో అధికారానికి అవసరమైన బలం తమకు రాలేదని అంగీకరించినా, పార్టీ ఉనికిని తగ్గించలేరని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 227 స్థానాలున్న బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ, శిందే వర్గం శివసేన కలిసిన కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా, ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన 27 సీట్లు గెలుచుకుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన 64 స్థానాలను దక్కించుకుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

సంగారెడ్డి నుంచి జీవితంలో పోటీ చేయ‌ను – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -