Friday, August 29, 2025

ముంబైలో కుండపోత వర్షాలు

Must Read

ముంబైలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారులన్నీ నీట మునిగిపోయి, పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడటంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాజవాడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ, నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరం తప్ప బయటకు వెళ్లకూడదని పోలీస్ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 100 / 112 / 103 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపింది. అలాగే, మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, సహాయం కోసం ప్రధాన కంట్రోల్ రూమ్ 1916 నంబర్‌ను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -