Saturday, August 30, 2025

రిజిస్టర్డ్ పోస్టల్ సేవలకు గుడ్‌బై

Must Read

పోస్టల్‌ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ పోస్టల్ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. ఇకపై రిజిస్టర్డ్ పోస్టల్‌ సర్వీసు స్థానంలో స్పీడ్‌ పోస్ట్‌ సేవలనే కొనసాగించనున్నారు. అంటే రిజిస్టర్డ్‌ పోస్టల్‌ లేఖలు, పత్రాలు, డాక్యుమెంట్లు ఇకపై స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా మాత్రమే పంపే అవకాశం ఉంటుంది. పోస్టల్‌ రంగంలో ఇది ఒక చారిత్రక నిర్ణయం. ఎందుకంటే రిజిస్టర్డ్ పోస్టల్‌ సర్వీస్ అనేది గతంలో ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంలా ఉండేది. ముఖ్యంగా విద్యార్థుల అప్లికేషన్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ పత్రాలు, నియామక లేఖలు, వ్యక్తిగత లేఖల వరకు.. ప్రతిదానికీ రిజిస్టర్డ్ పోస్టు ఒక విశ్వసనీయమైన సేవగా నిలిచింది. కాలానుగుణ మార్పుల్లో స్పీడ్‌ పోస్ట్‌, కూరియర్‌ సేవలు విస్తరించడంతో రిజిస్టర్డ్ పోస్టు వినియోగం గణనీయంగా తగ్గిపోవడం, సాంకేతికత ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరగడం ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్టల్‌ సేవలు చరిత్రలో కలసిపోనుండటంతో, ఒక తరం జ్ఞాపకం మరుగున పడనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -