Monday, January 26, 2026

నేటి నుంచి షూటింగ్స్ బంద్

Must Read

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి టాలీవుడ్‌లోని అన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్‌ బంద్‌ చేస్తున్నట్లు ఫెడరేషన్‌ ప్రకటించింది. ఫెడరేషన్‌ డిమాండ్ల ప్రకారం, సిబ్బందికి కనీసం 30 శాతం వేతనాలు పెంచాలని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వేతనాలు పెండింగ్‌ లేకుండా రోజువారీగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం కేవలం తెలుగు సినిమాలకే కాకుండా ఇతర భాషా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. “వేతనాలు పెంచితేనే మేము షూటింగ్స్‌లో పాల్గొంటాం” అని ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. దీంతో టాలీవుడ్‌ సహా దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. ఈ నిర్ణయం నేపథ్యంలో అనేక పెద్ద సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోవడం ఖాయం కాగా, ప్రొడ్యూసర్లతో ఫెడరేషన్‌ మధ్య చర్చలు ఏ దిశగా సాగుతాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -