Friday, August 29, 2025

జ‌డ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ అక్రమాలు – వైయ‌స్ జ‌గ‌న్

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో పులివెందుల, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్‌ ఆరోపణల ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, అధికారులను ఉపయోగించి ఎన్నికలను “హైజాక్‌” చేశారని విమర్శించారు.ఈ ఘటన రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో “బ్లాక్‌ డే”గా మిగిలిపోతుందని అన్నారు.
రెండు చిన్న స్థానాల కోసం టీడీపీ గూండాల్లా వ్యవహరించిందని, ఓటర్లను బెదిరించి వెనక్కి పంపించిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసి, ఫారాలు లాక్కుని, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించారని తెలిపారు. బయట నియోజకవర్గాల నుంచి వందలమంది టీడీపీ కార్యకర్తలను తెప్పించి దొంగ ఓట్లు వేయించారని చెప్పారు. పోలీసులు టీడీపీ కోసం కాపలా కాశారని, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఎన్నికల అక్రమాలకు సహకరించారని ఆరోపించారు.పులివెందులలో పోలింగ్‌ బూత్‌లను దూరంగా మార్చి ఓటర్లకు ఇబ్బంది కలిగించారని విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడం ప్రభుత్వ విధి ఉల్లంఘన అని అన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు క్షీణించాయని ఆరోపించారు.
ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలు, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అన్నీ మోసపూరితమని చెప్పారు.కరెంటు ఛార్జీలు, ఇసుక, మట్టి, లిక్కర్‌ మాఫియాలతో రాష్ట్రం నిండిపోయిందని ఆరోపించారు. ప్రజలు తనకే ఓటేస్తారనే నమ్మకం ఉంటే చంద్రబాబు ఇలాంటి అరాచకాలకు పాల్పడరని అన్నారు. 2017 నంద్యాల ఉపఎన్నికలోనూ ఇలాంటివే అక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. 2019 తరహాలో భవిష్యత్తులో ప్రజలు స్పందించి టీడీపీకి బుద్ధి చెబుతారని నమ్మకం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థలు మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రతి బూత్‌ వెబ్‌కాస్టింగ్‌, సీసీ ఫుటేజీని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫుటేజీ ఆధారంగా బయటి ఓటర్లను గుర్తించి ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఎన్నికల అక్రమాలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -