పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందంటారని, కానీ తన ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలని, బుల్డోజర్ న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు సరైనదేనని తెలిపారు. మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులమే విషయం మరిచిపోరాదన్నారు. ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయని, కేవలం మనకు అధికారం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది జడ్జీలను ప్రభావితం చేయకూడదన్నారు. న్యాయమూర్తులు స్వతంత్రంగా ఆలోచించాలని చెప్పారు.