ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్ తదితరులు ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు.