మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆయన కోరారు. తుపాను సహాయం, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు.

