హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలసదన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలసదన్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్ గార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఆ గార్డు బాలుడిని అనుమతి లేకుండా ఇంటికి పంపించాడని, ఇంటికి చేరిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలసదన్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ స్టాఫ్ గార్డును అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆ గార్డు మరో నలుగురు బాలలపై కూడా లైంగిక దాడి చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం అధికారులు బాలసదన్‌లోని ఇతర పిల్లలపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.