Monday, October 20, 2025

మెడిక‌ల్ స్టూడెంట్‌ అత్యాచార కేసులో ఆరో అరెస్ట్!

Must Read

దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల ఒడిశా జలేశ్వర్‌కు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన వాగ్మూలంలో, తన మగ స్నేహితుడితో రాత్రి సమయంలో డిన్నర్‌కు వెళ్లినప్పుడు నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఆమె తండ్రి ఫిర్యాదులో కూడా నిందితుడి పేరును పేర్కొన్నారు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్ కాగా, నిందితుడిని రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, బాధితురాలి కథనాన్ని ధృవీకరించే భౌతిక ఆధారాల ఆధారంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన గ్యాంగ్ రేప్ కాదని, ఒకే వ్యక్తి చేసిన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -