Friday, January 16, 2026

ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లో సిట్ రైడ్స్

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన దూకుడును మరింత పెంచింది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై సిట్ అధికారులు మంగళవారం ఉదయం విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లో నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసినట్లు సమాచారం. లిక్కర్ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తర్వాత ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు లోతైన విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -