ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. అనంతరం ఆగస్టు 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక మరోవైపు, తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో అక్కడి ఎన్నికల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.