Wednesday, July 2, 2025

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

Must Read

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 13 నుంచి 23 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. దీనికోసం ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోరారు. రేవంత్‌ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -