Monday, October 20, 2025

ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

Must Read

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. ఈనెల 23 నుంచి వచ్చే నెల నాలుగు వరకు న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. షరతులతో అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. 50 వేల రూపాయల విలువైన రెండు జమీన్లను సమర్పించాలని ఆదేశించింది. న్యూయార్క్ లో బస వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. తీర్పును శుక్రవారం వెలువరిస్తామని ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈరోజు మిథున్ రెడ్డికి ఊరట కల్పిస్తూ న్యూయార్క్ పర్యటనకు షరతులతో అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 26న అమెరికా వెళ్లనున్న పార్లమెంటరీ బృందంలో మిథున్ రెడ్డి పేరు ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -