Saturday, August 30, 2025

దేశవ్యాప్తంగా 476 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

Must Read

రాజకీయ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిన పార్టీలపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 9 పార్టీల గుర్తింపులు రద్దు అయ్యాయి. గతంలో మొదటి జాబితాలో 334 పార్టీలను తొల‌గించిన ఈసీ, సోమవారం రెండో జాబితాను విడుదల చేసింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాలనే ప్రధాన షరతు నెరవేర్చని రిజిస్టర్డ్‌ కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను స్వచ్ఛంగా మార్చేందుకు రూపొందించిన సమగ్ర వ్యూహంలో ఇది భాగమని ఈసీ పేర్కొంది. డీ–లిస్ట్‌ అయిన పార్టీలు ఇకపై ప్రజాప్రాతినిథ్య‌ చట్టం–1951లోని సెక్షన్‌ 29సీ, 29బీ, ఆదాయపన్ను చట్టం–1961, అలాగే ఎన్నికల గుర్తులు ఆర్డర్‌–1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -