Monday, October 20, 2025

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖ‌రారు!

Must Read

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ప్రధాని మోడీ శ్రీశైలం ఆలయంలో దర్శనం, అలాగే కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16న ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, 10:20 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 గంటలకు హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలిప్యాడ్‌కు బయల్దేరి, 11:05 గంటలకు చేరుకుంటారు. అనంతరం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11:45 గంటలకు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు గెస్ట్ హౌస్‌కు తిరిగి వచ్చి, 1:25 గంటలకు సున్నిపెంటకు బయల్దేరతారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుని, 2:30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4:00 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం 4:15 గంటలకు రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుని, 4:40 గంటలకు హెలికాప్టర్‌లో కర్నూలు విమానాశ్రయానికి తిరిగి వస్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు చేరుకోవడంతో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగియనుంది. ఈ పర్యటన ద్వారా శ్రీశైలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించనుంది. స్థానిక ప్రజలు, అధికారులు ఈ సందర్శన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -