Saturday, July 5, 2025

మే 2న మోదీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌

Must Read

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరు కానున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -