Tuesday, October 21, 2025

నెల్లూరు పర్యటనలో జగన్.. పోలీసుల‌ ఆంక్షలు

Must Read

నెల్లూరులో నేడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ రోజు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ చేయనున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు, భారీ గుమికూడింపులు జరగకుండా పలు ఆంక్షలను అమలు చేశారు. నెల్లూరులో ఎక్కడ చూసినా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నెల్లూరుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు హెలిప్యాడ్ వద్ద వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు రాకతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -