Monday, October 20, 2025

వ్యూస్ కోసం చిన్నారుల భవిష్యత్తుతో ఆటలు సరికాదు: సీపీ సజ్జనార్

Must Read

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చిన్నారులను ఉపయోగించడం చట్టవిరుద్ధమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నాయని, ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాక, పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలకు విరుద్ధమని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చిన్నారులతో ఇలాంటి కంటెంట్ తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి వీడియోలను తక్షణం తొలగించాలని సజ్జనార్ ఆదేశించారు. ప్రజలు ఇలాంటి కంటెంట్‌ను గమనిస్తే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల బాల్యం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -