ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలీకాప్టర్ ఎగరడానికి అనుమతి లభించలేదు. ఈ కారణంగా గురువారం చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దయింది. త్వరలో మరోసారి ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ సభ నిర్వహించింది. సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో జరిగిన ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని 10 నిమిషాల పాటు ప్రసంగించారు.