Tuesday, October 21, 2025

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు!

Must Read

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలతల పేర్లను పరిశీలించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, వీరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్ హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇప్పటికే ఈ ముగ్గురు పేర్లతో కూడిన నివేదికను అధిష్టానానికి సమర్పించారు. కమిటీ దీపక్ రెడ్డి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభ్యర్థి పేరును సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కె. లక్ష్మణ్ వెల్లడించారు. ఈ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -